Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీగ్ దశలో పోటాపోటీగా మ్యాచులు
నవతెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. లీగ్ దశలో మ్యాచులు పోటాపోటీగా సాగుతున్నాయి. గెలుపు అంతరం స్వల్పంగా ఉండటంతో.. విజయం కోసం ఆఖరు వరకూ ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం జరిగిన లీగ్ దశ మ్యాచుల్లో మహిళల విభాగంలో నాగర్‌కర్నూల్ 68-45తో భువనగిరిపై, మహబూబ్ నగర్ 50-48తో నిర్మల్‌పై, కొత్తగూడెం 52-45తో మహబూబాబాద్‌పై విజయాలు సాధించాయి. ఏకపక్షంగా సాగిన మ్యాచుల్లో భూపాలపల్లిపై నల్లగొండ 91-7తో, కామారాడ్డిపై మేడ్చల్ 49-16, మంచిర్యాలపై ఖమ్మం 41-18తో విజయాలు నమోదు చేశాయి. పురుషుల విభాగంలో వరంగల్ అర్బన్‌పై నాగర్‌కర్నూల్ 52-23తో, మెదక్‌పై కొత్తగూడెం49-36తో, సిద్దిపేటపై జనగాం 36-34తో, ఖమ్మంపై మేడ్చల్ 41-33తో గెలుపొందాయి. అసిఫాబాద్ను హైదరాబాద్ 75-17తో, పెద్దపల్లిని జనగాం 80-20తో చిత్తుగా ఓడించాయి. చెర్ల ఆంజనేయులు స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానిక వైష్ణవి క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌కు తరలివచ్చారు.