Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్నెస్ ఇప్పుడు జట్టు చర్చల్లో భాగం
- భారత సీనియర్ పేసర్ ఇషాంత్
న్యూఢిల్లీ : ఆధునిక క్రికెట్లో నైపుణ్యం ఉంటే సరిపోదు. ఆరు పలకల దేహం సైతం తప్పనిసరి. ఫిట్నెస్ను పట్టించుకోకుండా రుచికి బానిసైతే.. జాతీయ జట్టులో చోటు గల్లంతు కావటం ఖాయం. ఇటీవల జాతీయ జట్టులోకి ఎంపికైనా ఫిట్నెస్ లేదని రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తిలు బంగారు అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. గతంలో టీమ్ ఇండియా జట్టు సమావేశాల్లో స్కిల్పైనే చర్చ నడిచేది. విరాట్ కోహ్లి హయాంలో ఫిట్నెస్ సైతం జట్టు సమావేశంలో భాగమైందని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. ' విరాట్ కోహ్లి జట్టులో ఫిట్నెస్ ప్రమాణాలను నెలకొల్పాడు. తీసుకునే కొవ్వు శాతం గురించి.. గతంలో ఎన్నడూ జట్టు సమావేశంలో చర్చించలేదు. గతంలో సమావేశం పూర్తిగా నైపుణ్యంపైనే దృష్టి పెట్టేది. విరాట్ వచ్చాక నైపుణ్యంతో పాటు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటేనే మైదా నంలో చురుగ్గా కదలుతాం, ఫిట్నెస్ను నిలుపుకుంటాం. విరాట్ కోహ్లి తాను సాధించిన ఫిట్నెస్ ప్రమాణాలతో.. భారత్ క్రికెట్ వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చాడు' అని ఇషాంత్ శర్మ తెలిపాడు.