Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ :
68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్ జట్ల జోరు కొనసాగుతోంది. బోడుప్పల్‌లోని వైష్ణవి క్రికెట్ అకాడమీ మైదానంలో జరుగుతున్న పోటీలలో హైదరాబాద్ జట్లు నాకౌట్ దిశగా దూసుకెళ్తున్నాయి. పురుషుల విభాగంలో ములుగుపై 50-24తో హైదరాబాద్ (2) ఘన విజయం సాధించింది. హైదరాబాద్(1) 65-22తో సిద్దిపేటను ఓడించింది. సిరిసిల్లపై భూపాలపల్లి 41-36తో, వరంగల్‌పై గద్వాల్ 53-21తో, మంచిర్యాలపై మహబూబాబాద్ 36-29తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో హైదరాబాద్ 40-25తో సంగారెడ్డిపై, మంచిర్యాలపై నాగర్‌కర్నూల్ 48-17తో, పెద్దపల్లిపై నల్లగొండ 62-28తో గెలుపొందాయి.