Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ కు బౌలింగ్ లెంగ్త్ పై కుల్దీప్ యాదవ్
కోల్‌కత : చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కొంతకాలంగా పేలవ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2020లో కోల్‌కత నైట్‌రైడర్స్ తరఫున ఐదు మ్యాచులే ఆడిన కుల్దీప్ యాదవ్ ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా బెంచ్‌కు పరిమితమైన చైనామన్ స్పిన్నర్.. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ అదే చేశాడు. ఐదు టీ20ల సిరీస్‌లో అవకాశం రాని కుల్దీప్ కు.. వన్డే సిరీస్‌లో చాన్స్ లభించింది. రెండు వన్డేల్లో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 152 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా రెండో వన్డేలో బెన్ స్టోక్స్ దూకుడుకు కుల్దీప్ బలైపోయాడు. కుల్దీప్ పై హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన స్టోక్స్ 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 44 ఓవర్లలోనే ఛేదించేలా చేశాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఎదురైన ఇబ్బందిపై కుల్దీప్ స్పందించాడు. ' ఏ లెంగ్త్‌లో బంతులు వేయాలో నాకు అర్థం కాలేదు. పిచ్ నుంచి స్పిన్‌కు ఎటువంటి సహకారం లభించలేదు. రెగ్యులర్‌గా ఆడితే, ఏ లెంగ్త్‌లో వేయాలనే ఐడియా వేగంగా తడుతుంది. విరామం అనంతరం ఆడినప్పుడు ఇటువంటి ఇబ్బందులు తప్పవు. నేను నా లెంగ్త్ పై కష్టపడితే మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉండేది. చాలాకాలం తర్వాత ఆడుతుండటంతో తొలి వన్డే చాలా కీలకం. కానీ నేను రిథమ్ అందుకోలేదు. రెగ్యులర్‌గా ఆడితే రిథమ్ సమస్య కాదు. రెండో వన్డేలో మెరుగ్గానే బౌలింగ్ చేశాను, కానీ పిచ్ నుంచి ఎటువంటి సహకారం లేదు. ఫ్లాట్ పిచ్‌లపై లెంగ్త్ ఎంతో కీలకం' అని కుల్దీప్ యాదవ్ అన్నాడు.