Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో పోరాడి ఓడిన గద్వాల్
నవతెలంగాణ, హైదరాబాద్ : 68వ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్స్‌లో రంగారెడ్డి విజేతగా నిలిచింది. బోడుప్పల్‌లోని వైష్ణవి క్రికెట్ మైదానంలో శుక్రవారం గద్వాల్‌తో జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జట్టు టై బ్రేకర్‌లో విజయం సాధించింది. పురుషుల విభాగంలో నిజామబాద్పై 39-36తో రంగారెడ్డి... 54-35తో హైదరాబాద్‌పై గద్వాల్ గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకున్నాయి. టైటిల్ పోరులో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. ప్రథమార్థంలో గద్వాల్, రంగారెడ్డిలు 22-22తో సమవుజ్జీలుగా నిలిచాయి. పూర్తి సమయం అనంతరం సైతం ఇరు జట్లు 41-41తో నిలిచాయి. దీంతో విజేతను టైబ్రేకర్ ద్వారా తేల్చారు. రంగారెడ్డి 46-45తో గద్వాల్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, సి. మల్లారెడ్డి, నిర్వాహకులు మంద సంజీవరెడ్డిలు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ నెలలో అయోధ్యలో జరుగనున్న జాతీయ సీనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును ఈ చాంపియన్‌షిప్స్ ద్వారా సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్టు టోర్నీ నిర్వాహకులు మంద సంజీవరెడ్డి తెలిపారు.