Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్లో వెల్లడించిన లిటిల్ మాస్టర్
ముంబయి : భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ హాస్పిటల్లో చేరాడు. మార్చి 27న కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన క్రికెట్ లెజెండ్.. అప్పట్నుంచి నవీ ముంబయిలోని ఇంట్లో స్వీయ ఐసోలేషన్‌లో గడిపాడు. మహమ్మారి సోకిన ఆరు రోజుల అనంతరం వైద్యుల సూచనల మేరకు సచిన్ టెండూల్కర్ శుక్రవారం హాస్పిటల్లో చేరారు. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ' మీ ప్రార్థనలకు, అభిమానానికి ధన్యావాదాలు. వైద్యుల సూచనల మేరకు ముందుజాగ్రత్తగా నేను హాస్పిటల్లో చేరాను. కొద్దిరోజుల్లోనే తిరిగి ఇంటికి వస్తానని ఆశిస్తున్నాను. జాగ్రత్తలు తీసుకోండి, సురక్షితంగా ఉండండి. భారతీయులు అందరికీ, నా సహచరులకు 2011 ప్రపంచకప్ విజయం పదో వార్షికోత్సవం శుభాకాంక్షలు' అని సచిన్ ట్వీట్ చేశాడు. సచిన్ టెండూల్కర్‌తో పాటు రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడిన ఇర్షాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్‌లు సైతం కోవిడ్-19 బారిన పడిన సంగతి తెలిసిందే.