Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ కోచ్ వసీం జాఫర్
ముంబయి : ఐపీఎల్ 2020లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేశాడు. సీజన్లో అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. సహజ విధ్వంసక ఓపెనర్ నుంచి సహాయక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన కెఎల్ రాహుల్ పవర్ ప్లేలో ఆశించిన విధ్వంసం సృష్టించలేదు. రాహుల్ స్ట్రయిక్‌రేట్ 129.35పై విమర్శలు వినిపించాయి. రాహుల్ నెమ్మదైన బ్యాటింగ్‌తోనే పంజాబ్ పలు మ్యాచుల్లో తృటిలో విజయం చేజార్చుకుందనే విమర్శలు ఉన్నాయి. ' స్ట్రయిక్ రేట్లు చాలా ఓవర్రేటెడ్' అని వ్యాఖ్యానించాడు. గత సీజన్లో రాహుల్ నిజంగానే కాస్త నెమ్మదిగా ఆడాడని.. కానీ ఈ సీజన్లో ఉగ్రరూపం దాల్చుతాడని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ అన్నాడు. ' రాహుల్ గత సీజన్లో కాస్త నెమ్మదిగానే ఆడాడు. నం.5 తర్వాత బ్యాట్స్‌మెన్ లేరనే అతడు ఆ విధంగా ఆడాడు. గ్లెన్ మాక్స్వెల్ రాణించకపోవటం ఓ కారణం. బాధ్యత తీసుకుని ఆఖరు వరకూ క్రీజులో ఉండాలని అనుకున్నాడు. కానీ రానున్న సీజన్లో అలాకాదు. ప్రతి ఒక్కరూ కెఎల్ రాహుల్ ఉగ్రరూపం చూస్తారు' అని జాఫర్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో వైఫల్యం రాహుల్‌ను ప్రభావితం చేయలేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ' ప్రతి బ్యాట్స్‌మెన్‌కు ఇది జరుగుతుంది. ఎక్కువ మ్యాచులు ఆడేకొద్ది, మరింత మెరుగైన బ్యాట్స్‌మన్‌గా తయారుకాగలడు. రాహుల్ టీ20 సిరీస్‌లో విఫలమయ్యాడు. అంతమాత్రాన అతడు చెత్త బ్యాట్స్‌మన్ అయిపోడు. మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన రాహుల్‌కు తన ఆట గురించి బాగా తెలుసు. అతడు ఎందుకు ప్రత్యేకమైన ఆటగాడో వన్డే సిరీస్‌లో నిరూపించాడు' అని జాఫర్ అన్నాడు.