Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో కరోనా ప్రభావం
ముంబయి: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచులపై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ తొలి వారంలో కొత్త కేసుల నమోదు ఇలాగే కొనసాగితే.. మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ విధించటం అనివార్యమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికగా హైదరాబాద్‌ను పరిశీలిస్తున్నారు. కరోనా తీవ్రత, లాక్డౌన్లతో సంబంధం లేకుండా బయో బబుల్‌లో ఐపీఎల్ నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి భరోసా లభించినా.. ముంబయి సహా కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా కనిపిస్తోన్న బెంగళూర్, చెన్నైలలో ఎక్కడ సమస్య తలెత్తినా ఆ మ్యాచులను హైదరాబాద్‌కు తరలించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నై, ఢిల్లీ, పంజాబ్ ,రాజస్థాన్‌లు ముంబయిలో సాధన చేస్తున్నాయి. ముంబయిలో ప్రస్తుత పరిస్థితుల దష్ట్యా వాంఖడే మ్యాచులను హైదరాబాద్‌కు తరలించటమే మేలని బీసీసీఐ భావిస్తోంది!.