Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్షర్, వాంఖడే సిబ్బందికి పాజిటివ్
ముంబయి : ఐపీఎల్ 14 ఆరంభానికి ముందే కరోనా మహమ్మారి కలవరం మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్ పటేల్ సహా చెన్నై సూపర్‌కింగ్స్‌లో ఒకరు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. ఐపీఎల్ లీగ్ దశలో పది మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ముంబయి వాంఖడే స్టేడియంలో పది మంది సిబ్బంది సహా బీసీసీఐ ఈవెంట్ మేనేజ్మెంట్ సిబ్బందిలో ఆరుగురు కరోనా బారిన పడ్డారు. అక్షర్ పటేల్ ఐసోలేషన్‌లో ఉండగా.. చెన్నై సైతం పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తిని (టెక్నికల్ టీమ్) ప్రత్యేకంగా ఉంచుతోంది. వాంఖడే స్టేడియంలోని క్లబ్ హౌస్‌లో మైదాన సిబ్బంది ఐసోలేషన్‌లో కొనసాగుతున్నారు. నెగెటివ్‌గా వచ్చిన వారు మాత్రమే మైదానంలో పని చేస్తున్నారని ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధికారి ఒకరు తెలిపారు.