Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీఏ కార్యదర్శి సంజయ్ నాయక్
ముంబయి : కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఐపీఎల్ నిర్వహణను సందిగ్ధంలో పడేస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2021 ఆరంభం కానుండగా.. ముంబయి వాంఖడే స్టేడియంలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఐపీఎల్ మ్యాచులు ముంబయిలోనే జరుగుతాయని ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) కార్యదర్శి సంజయ్ నాయక్ అన్నారు. 'ప్రస్తుతానికి వాంఖడే స్టేడియంలో ఎవరూ లేరు. వారాంతంలో స్టేడియం మూసివేశాం. సోమవారం మైదాన సిబ్బందికి అందరికీ బీసీసీఐ కోవిడ్-19 పరీక్షలు చేయనుంది. పాజిటివ్‌గా వచ్చినవారిని ఇంటికి పంపిస్తాం. నెగెటివ్ వచ్చిన తర్వాతే స్టేడియంలోని క్లబ్‌హౌస్‌లోని బయో బబుల్‌లోకి అనుమతిస్తాం. ముంబయిలో ఐపీఎల్ మ్యాచులు పూర్తయ్యేవరకూ మైదాన సిబ్బంది స్టేడియంలోనే ఉంటారు. మైదాన సిబ్బంది ప్రజా రవాణాను వినియోగించటంతోనే వైరస్ బారిన పడ్డారు. సోమవారం కోవిడ్-10 పరీక్షల అనంతరం పరిస్థితిపై పూర్తి స్పష్టత రానుంది. ఐపీఎల్ మ్యాచులకు ముంబయి ఆతిథ్యం ఇస్తుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు' అని సంజయ్ నాయక్ తెలిపారు.