Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫకర్ జమాన్ రనౌట్ పై బవుమా
జొహనెస్ బర్గ్ : పరుగుల వరద పారిన జొహనెస్‌బర్గ్ రెండో వన్డేలో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేసిన చర్య వివాదాస్పదమైంది. తొలుత దక్షిణాఫ్రికా 341/6 పరుగులు చేయగా.. ఛేదనలో పాకిస్థాన్ 324/9కే పరిమితమైంది. 120/5తో ఓటమి కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌ను ఓపెనర్ ఫకర్ జమాన్ (193, 155 బంతుల్లో 18 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుత ఆటతీరుతో రేసులోకి తీసుకొచ్చాడు. ఆరు బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో.. ఫకర్ జమాన్‌ను రనౌట్ చేసేందుకు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చిన్న ట్రిక్ వాడాడు. స్ట్రయికర్‌గా బంతిని ఎదుర్కొన్న ఫకర్ జమాన్ రెండో పరుగు కోసం వికెట్ కీపర్ ఎండ్‌కు పరుగెడుతూ వస్తున్నాడు. ఫీల్డర్ నాన్‌స్ట్రయికర్ ఎండ్‌కు బంతిని అందిస్తున్నట్టుగా డికాక్ సైగలు చేశాడు, దీంతో ఆవలి ఎండ్‌లో రౌఫ్ చేరుకున్నాడో లేదోనని ఫకర్ జమాన్ నెమ్మదించి వెనక్కి తిరిగి చూశాడు. అంతలోపే డైరెక్ట్ హిట్‌తో ఫకర్ జమాన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. పాకిస్థాన్ 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. క్లిష్ట సమయంలో డికాక్ తెలివిగా రనౌట్ చేశాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా అనగా.. రనౌట్‌కు స్వీయ తప్పిదమే కారణమని ఫకర్ జమాన్ పేర్కొన్నాడు.
ఎంసీసీ నిబంధనల ప్రకారం స్ట్రయిక్ర్ బంతిని ఎదుర్కొన్న అనంతరం బ్యాట్స్‌మన్ దృష్టి మళ్లించేందుకు, మోసం చేసేందుకు సైగలు, మాటలతో ఉద్దేశ్యపూర్వకంగా ప్రవర్తిస్తే అది నిబంధనలకు విరుద్ధం. ఈ మేరకు నిబంధన 41.5.1 చెబుతోంది. ఈ నిబంధన ప్రకారం ఆ బంతికి తీసిన పరుగులు (2)లతో పాటు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తారు. ఆ బంతిని మళ్లీ వేయాల్సి వస్తోంది. ఈ లెక్కన పాక్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో సమీకరణం ఆరు బంతుల్లో 24 పరుగులకు మారేది.