Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్కహాల్ కంపెనీల లోగోలు తొలగించిన చెన్నై
చెన్నై : అంతర్జాతీయ క్రికెట్లో చాలా మంది ఆల్కహాల్, టోబాకో కంపెనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు నిరాకరించారు. ముస్లిం మత విశ్వాసాలు కలిగి ఉన్న హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహీర్, మోయిన్ అలీలు తామా ప్రాతినిథ్యం వహించే జాతీయ జట్టు, క్లబ్, ఫ్రాంఛైజీల జెర్సీలపై ఆల్కహాల్ కంపెనీల లోగోలు ఉంటే ధరించేందుకు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసం హషీమ్ ఆమ్లా సఫారీ బోర్డు నుంచి వేతన కోత సైతం ఎదుర్కొన్నాడు. ఐపీఎల్14లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మోయిన్ అలీ సైతం ఆల్కహాల్ బ్రాండ్లతో ఉన్న జెర్సీ ధరించలేనని సూపర్‌కింగ్స్ యాజమాన్యానికి తెలిపాడు ఎస్ఎన్జె 10000, బ్రిటీష్ ఎంపైర్ కంపెనీలు సూపర్‌కింగ్స్ జెర్సీ లోగో భాగస్వాములు. ఈ రెండు లోగోలు లేకుండా మోయిన్ అలీకి సూపర్‌కింగ్స్ ప్రత్యేక జెర్సీని సిద్ధం చేసేందుకు సమ్మతించింది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ఆడినప్పుడు సైతం మోయిన్ అలీ ఆల్కహాల్ బ్రాండ్ లోగోలతో కూడిన జెర్సీలను ధరించలేదు. 2019 ప్రపంచకప్ నెగ్గిన సమయంలో ఇంగ్లీష్ క్రికెటర్లతో కలిసి షాంపైన్ సంబురాలకు ఆదిల్ రషీద్, మోయిన్ అలీ నిరాకరించిన సంగతి తెలిసిందే.