Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 స్పాన్సర్లు, 100కు పైగా ప్రకటనదారులు
- ఐపీఎల్ 2021కు స్టార్ స్పోర్ట్స్ ఒప్పందాలు
ముంబయి : కరోనా మహమ్మారి కార్పోరేట్ ప్రపంచానికి కాదనే విషయం మరోసారి విస్పష్టంగా తేలిపోయింది!. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానుంది. అధికారిక ప్రసారదారు స్టార్ఇండియా ఐపీఎల్ కోసం రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుంది. 18 కంపెనీలు స్పాన్సర్లుగా, వందకు పైగా ప్రకటనదారులు స్టార్‌స్పోర్ట్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. డ్రీమ్11, బైజూస్, ఫోన్‌పే, జస్ట్‌డయల్, అప్‌స్టాక్, బింగో, కమ్లా పసంద్, అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, ఫ్రూటీ, ఆసియా పెయింట్స్, థమ్స్ అప్, వోడాఫోన్-ఐడియా, మండోలెజ్, అమెజాన్ ప్రైమ్, గ్రోవ్, క్రెడ్, గార్నీయర్ మెన్, హవెల్స్లు వీవీ ఐపీఎల్ 2021కు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎడ్యుటెక్, ఫాంటసీ స్పోర్ట్స్, బెవరేజెస్, పే వాలెట్స్, హౌమ్ డెకర్, ఆటో, టెలికాం, కన్సూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, సహా ఇతర విభాగాల వారీగా స్టార్‌స్పోర్ట్స్ ప్రకటనలను ఆకర్షిస్తోంది.