Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వాంఖడే స్టేడియం సిబ్బందిలో మరో ముగ్గురు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. మైదాన సిబ్బందిలో పది మంది కరోనా బారిన పడటంతో ముంబయిలో ఐపీఎల్ 14 మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. సోమవారం మైదాన సిబ్బంది అందరికీ బీసీసీఐ కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయగా.. ఇద్దరు గ్రౌండ్స్‌మెన్, ప్లంబర్‌కు పాజిటివ్ వచ్చింది. నెగెటివ్ వచ్చిన వారికి వాంఖడే స్టేడియంలోని క్లబ్‌హౌస్‌లో ఎంసీఏ అధికారులు బస ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 10న వాంఖడేలో ఐపీఎల్ 14 సీజన్లో తొలి మ్యాచ్ జరుగనుంది.