Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జగన్మోహన్ రావు కృషి ఫలించింది. హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరు నెలల్లోనే జగన్మోహన్ రావు తన మార్క్ చూపిస్తున్నాడు. భారత్‌లో హ్యాండ్‌బాల్‌కు మరింత ఆదరణ దక్కేందుకు.. రానున్న ఖేలో ఇండియా-2021 క్రీడల్లో హ్యాండ్‌బాల్‌ను భాగం చేశారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఖేలో ఇండియా గేమ్స్‌లో హ్యాండ్‌బాల్‌కు చోటు కల్పించినందుకు క్రీడాశాఖ మంత్రి రిజుజు, భారత ఒలింపిక్ సంఘానికి జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు.