Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్
ముంబయి : ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున స్టీవ్ స్మిత్ నం.3 స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తాడని ఆ జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించిన స్మిత్.. ఈ ఏడాది వేలంలో క్యాపిటల్స్ గూటికి చేరుకున్నాడు. రూ. 2 కోట్ల కనీస ధరకే డీసీ స్మిత్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ గాయంతో దూరం కాగా.. బ్యాటింగ్ లైనప్‌లో నం.3 స్థానం భర్తీ చేయాల్సి ఉంది. ' తుది జట్టులో స్మిత్‌కు అవకాశం లభిస్తే నం.3 పొజిషన్లో అతడు బ్యాటింగ్ చేస్తాడు. ఈ ఏడాది స్మిత్ రాణిస్తాడని అనుకుంటున్నాను. వచ్చే ఏడాది మెగా వేలం ఉండటంతో ఈ సీజన్లో మెరిస్తే స్మిత్ తన ధరను పెంచుకోవచ్చు' అని రికీ పాంటింగ్ అన్నాడు. కగిసో రబాడ, మార్కస్ స్టోయినిస్, ఎన్రిచ్ నోర్జెలు ఫామ్‌లో ఉండటంతో తుది జట్టులో చోటు కోసం స్మిత్ గట్టి పోటీ ఎదుర్కొనున్నాడు.