Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయో బబుల్స్‌లో ఉండటం కష్టమే
- బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
కోల్‌కత : భారత క్రికెటర్లు అత్యంత సహనశీలురుగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభివర్ణించాడు. కరోనా మహమ్మారి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఇప్పుడు బయో సెక్యూర్ బబుల్స్‌లో నిర్వ హిస్తున్నారు. విదేశీ క్రికెటర్లతో పోల్చితే మానసిక సమస్యలను ఎదుర్కొవటంలో మనవాళ్లే మెరు గని దాదా అన్నాడు. 'విదేశీ క్రికెటర్లతో పోల్చితే భారత క్రికెటర్లకు సహనం ఎక్కువ అని నా అభిప్రాయం. నేను ఎంతో మంది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెటర్లతో కలిసి ఆడాను. మానసిక సమస్యలపై వారు చేతులెత్తేస్తారు. గత 6-7 నెలలుగా బయో బబుల్స్‌లోనే క్రికెట్ ఆడు తున్నారు. అదెంతో కష్టమైన విషయం. హౌటల్ గది నుంచి మైదానానికి.. తిరిగి మైదానం నుంచి హౌటల్ గదికి రావటం మానసికంగా ఎంతో కష్ట మైన విషయం. అది పూర్తిగా భిన్నమైన జీవితం. ఆస్ట్రేలియా జట్టునే చూస్తే.. దక్షిణాఫ్రికా పర్యటనకు వాళ్లు నిరాకరించారు' అని గంగూలీ అన్నాడు.