Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 16న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ
నవతెలంగాణ- హైదరాబాద్ : గ్లోబల్ క్రికెట్ ఆన్ రూరల్ వికెట్ నినాదంతో తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తూ, ఆటను అభివృద్ది చేస్తున్న తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు అంశంపై అపెక్స్ కౌన్సిల్ త్వరలోనే తేల్చనుంది. ఈ నెల 16న బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. రాష్ట్ర క్రికెట్ సంఘాల టీ20 లీగ్‌లపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, మహిళా క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది నియామకం, మహిళల జట్టు విదేశీ పర్యటనలు, ఐసీసీ ఈవెంట్లకు వీసా మంజురూ, ఐసీసీ ప్రపంచకప్‌కు పన్ను మినహాయింపు సహా 16 అంశాలు అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో ఉన్నాయి. తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) బీసీసీఐ గుర్తింపు పొందితే.. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) గుత్తాధిపత్యానికి తెరపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.