Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్లో ధనాధన్‌కు ఆశావహులు సిద్ధం
నవతెలంగాణ, ముంబయి
2021 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ఆరాటపడుతున్న భారత క్రికెటర్లు..ఐపీఎల్ 14లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టులోని సభ్యుల సంఖ్యను ఐసీసీ ఇటీవల 23 నుంచి 30కి పెంచింది. దీంతో గరిష్టంగా 22 మంది క్రికెటర్లను ప్రపంచకప్ జట్టులోకి తీసుకునే వెసులుబాటు దక్కింది. ప్రపంచకప్ తుది జట్టు కూర్పుపై సెలక్టర్లకు ఇప్పటికే ఓ స్పష్టత ఉంది. గాయాల బెడద ఉత్నన్నమైతే.. అవకాశం దక్కగానే దుమ్మురేపే బెంచ్ ఆటగాళ్ల కోసం సెలక్షన్ కమిటీ అన్వేషిస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. వన్డేల్లో కృనాల్ పాండ్య, ప్రసిద్ కృష్ణలు అరంగ్రేటంలో అద్భుతాలు చేశారు. రానున్న ప్రపంచకప్‌లో భారత జట్టుకు అటువంటి బెంచ్ బలం ఉండేందుకు సెలక్షన్ కమిటీ చూస్తోంది. సంజు శాంసన్, నవదీప్ సైని, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ సహా ఇతర క్రికెటర్లు ప్రపంచకప్ జట్టులో చోటు ఆశిస్తున్నారు. సెలక్టర్లు కోరుకుంటున్న ప్రదర్శనలు, మ్యాచ్ విన్నింగ్ లక్షణాలను ఐపీఎల్లో ప్రదర్శించేందుకు రెఢీ అవుతున్నారు.
శిఖర్ ధావన్ జట్టులోకి ఎంపిక కావటం లాంఛనమే అయినా.. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయగలనని గబ్బర్ నిరూపించుకోవాల్సిందే. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థుడే, కానీ నిలకడగా చూపించుకోవాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు మిడిల్ ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించటంలో ఆకట్టుకుంటే సరిపోతుంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు అవకాశాలు లేకపోయినా.. పవర్ ప్లేలో వికెట్లు కూల్చటం, బ్యాట్స్‌మెన్‌పై నియంత్రణ కనబరిస్తే చాన్స్ లేకపోలేదు. కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్ మణికట్టు మాయలో మ్యాజిక్ చేయాల్సి ఉండగా.. దీపక్ చాహర్, నవదీప్ సైనిలు పవర్ ప్లే, డెత్ ఓవర్ల బౌలింగ్‌పై సెలక్టర్లు దృష్టి పెట్టనున్నారు. రాహుల్ తెవాటియ ఆల్‌రౌండర్ ప్రత్యామ్నాయంగా సెలక్టర్ల ప్రణాళికల్లో నిలిచేందుకు బ్యాట్‌తో, బంతితో మెరుగైన సీజన్ ప్రదర్శన చేయాలి.