Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆస్ప్రతి నుంచి డిశ్చార్డ్ అయ్యాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో ఆడిన సచిన్ టెండూల్కర్ కోవిడ్-19 బారిన పడిన సంగతి తెలిసిందే. తొలుత వారం రోజులు ఇంటిలోనే ఐసోలేషన్‌లో గడిపిన మాస్టర్ బ్లాస్టర్.. ముందు జాగ్రత్తగా గత వారం హాస్పిటల్లో చేరాడు. సచిన్ గురువారం హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. మరికొన్ని రోజులు ఇంట్లో ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్టు, తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.