Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నలుగురు భారత సెయిలర్లు పోటీపడబోతున్నారు. విష్ణు శరవణ్, చెంగప్ప గణపతి-వరుణ్ ఠక్కర్ జోడీ ఓమన్‌లో జరుగుతున్న ఏసియన్ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి ఒలింపిక్స్ బెర్తులు ఖాయం చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించబోతున్న తొలి మహిళా సెయిలర్‌గా నేత్ర కుమనన్ నిలిచింది. ముసన్నా ఓపెన్‌లో నేత్ర టోక్యో బెర్త్ కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించిన సెయిలర్లకు క్రీడా మంత్రి కిరణ్ రిజుజు అభినందనలు తెలిపారు.