Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఢిల్లీ, చెన్నై పోరు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ముంబయి: ఆరాధ్య ఆటగాడు ఎం.ఎస్ ధోనితో తలపడే, అతడి జట్టును మట్టికరిపించేందుకు సిద్ధమవుతున్నాడు సహజ విధ్వంసకారుడు రిషబ్ పంత్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లపై చారిత్రక టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రిషబ్ పంత్ భారత క్రికెట్ సర్క్యూట్లో అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం పంత్‌కు ప్రమోషన్ కల్పించింది. డీసీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 14 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ నేడు ముఖాముఖి మ్యాచ్‌తో టైటిల్ రేసును మొదలుపెట్టనున్నాయి. రిషబ్ పంత్, పృథ్వీ షా, అశ్విన్ వంటి భీకర ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లతో.. అసలు మ్యాచ్ ప్రాక్టీస్ లేని ధోని, రైనా, జడేజా, డుప్లెసిస్‌లు తలపడనుండటం ఆసక్తి రేపుతోంది. సూపర్‌కింగ్స్, క్యాపిటల్స్ చివరి ఐదు మ్యాచుల్లో మూడింట చెన్నై విజయాలు సాధించింది. కానీ గత సీజన్లో చెన్నై రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ దుమ్మురేపింది. దక్షిణాఫ్రికా పేసర్లు కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్జెలు నేటి మ్యాచ్‌కు అందుబాటులో లేరు. సూపర్‌కింగ్స్‌కు లుంగి ఎంగిడి సైతం సెలక్షన్‌కు అందుబాటులో లేడు. ఈ ముగ్గురు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. కెప్టెన్‌గా రిషబ్ పంత్ ప్రదర్శనపై ఫోకస్ నెలకొంది. భయమెరుగని క్రికెట్ ఆడే పంత్ కెప్టెన్‌గా బాధ్యతాయుతంగా ఆడతాడా? మరింత ప్రమాదకరంగా బంతి బాదుతాడా? అనేది చూడాలి. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవటం ఎం.ఎస్ ధోని భారీ షాట్ల హిట్టింగ్ సామర్థ్యాన్ని దెబ్బతీసింది. ఫినీషర్‌గా ధోని ముద్ర గత సీజన్లోనే చెరిగిపోయింది. జడేజాకు పూర్తి స్థాయిలో ఫినీషర్ బాధ్యతలను అప్పగించాల్సిన సమయం ఆసన్నమైంది. మ్యాచ్ ప్రాక్టీస్ లేని అంబటి రాయుడు, సురేశ్ రైనా సహా విజరు హజారేలో పరుగుల వరద పారించిన పృథ్వీ షా ప్రదర్శనపై ఆసక్తి ఎక్కువగా ఉంది.