Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తా చాటిన యువ రెజ్లర్లు
న్యూఢిల్లీ: భారత యువ రెజ్లర్లు సత్తా చాటారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో మెరిసిన అన్షు మాలిక్ (19), సోనమ్ మాలిక్ (18)లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.చైనా రెజ్లర్ జియా లాంగ్‌పై 5-2తో సోనమ్ విజయం సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో 0-6తో వెనుకంజలో నిలిచినా ఒలింపిక్ బెర్త్ ఖాయం చేసుకుంది. మహిళల 57 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన అన్షు మాలిక్ ఆకట్టుకునే ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్స్ మెడల్‌తో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇప్పటికే టోక్యో టికెట్ సాధించింది. సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఇప్పుడు ముగ్గురు మహిళా రెజ్లర్లు పోటీపడనున్నారు. పురుషుల విభాగంలో భజరంగ్ పూనియా, రవి దనియా, దీపక్ పూనియాలు సైతం టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.