Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్కతతో హైదరాబాద్ ఢ నేడు
చెన్నై: వైట్‌బాల్ ఫార్మాట్లో అత్యుత్తమ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. తొలిసారి ఐపీఎల్ సీజన్‌ను సారథిగా మొదలుపెడుతున్నాడు. ఇంగ్లాండ్ 2019 వరల్డ్‌కప్ విజయంలో మోర్గాన్‌కు అండగా నిలిచిన, కోల్‌కతకు రెండు టైటిళ్లు అందించిన చీఫ్ కోచ్ ట్రెవర్ బెయిలిస్‌ను సైతం నేడు ఇయాన్ ఎదుర్కొనున్నాడు. చెన్నై పిచ్‌కు అనువైన ఆయుధాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బలంగా కనిపిస్తోండగా.. విలక్షణ ఆటగాళ్లతో కోల్‌కత నైట్‌రైడర్స్ సీజన్‌ను సానుకూలంగా ఆరంభించాలని చూస్తోంది. డెవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్లు సన్‌రైజర్స్ తరఫున విదేశీ క్రికెటర్ల కోటాలో బరిలోకి దిగనుండగా.. విండీస్ మాయగాడు సునీల్ నరైన్‌తో తుది జట్టులో కోసం బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ పోటీపడుతున్నాడు. టర్బోనేటర్ హర్బజన్ సింగ్ అనుభవాన్ని చెపాక్ పిచ్‌పై సద్వినియోగం చేసుకోవాలని కోల్‌కత భావిస్తోంది. భారత్‌తో టెస్టులకు ఫిట్నెస్ సాధించకుండానే బరిలోకి దిగిన డెవిడ్ వార్నర్ నేడు సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. వార్నర్ ఫిట్నెస్, టాప్ ఆర్డర్లో దూకుడు సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాయి.