Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.12 లక్షల జరిమానా
ముంబయి: ఐపీఎల్ 14 సీజన్ తొలి మ్యాచ్‌లో పరాజయం చవిచూసిన చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనికి రూ.12 లక్షల జరిమానా విధించారు. నిబంధనల ప్రకారం 20 ఓవర్ల కోటాను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూర్ 110 నిమిషాలు, ముంబయి 104 నిమిషాల్లో 20 ఓవర్ల కోటా పూర్తి చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం 103 నిమిషాల సమయం తీసుకుంది. 18.4 ఓవర్లకు చెన్నై 97 నిమిషాలు తీసుకుంది. దీంతో ధోనికి మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించాడు. ఆలస్యానికి ఇతర కారణాలను సైతం పరిగణనలోకి తీసుకోవటంతో కోహ్లి, రోహిత్, పంత్‌లు జరిమానా నుంచి తప్పించుకున్నారు.