Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్లడించిన వీరెందర్ సెహ్వాగ్
న్యూఢిల్లీ: క్రికెట్ జెంటిల్మెన్, మిస్టర్ కూల్ రాహుల్ ద్రవిడ్ ఆగ్రహంతో కనిపించటం ఎవరూ చూడలేదు. క్రికెట్ మైదానంలో ద్రవిడ్ గొప్ప ఒరవడిని కొనసాగించాడు. ఎం.ఎస్ ధోనిపై మిస్టర్ కూల్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని తాజాగా వీరెందర్ సెహ్వాగ్ గర్తు చేశాడు. ఐపీఎల్ 2021 నేపథ్యంలో క్రెడ్ సంస్థ రూపొందించిన యాడ్‌లో బెంగళూర్ ట్రాఫిక్‌లో సహచర ప్రయాణీకులతో ద్రవిడ్ వీరంగం సృష్టించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ' రాహుల్ ద్రవిడ్ కోపంగా ఉండటాన్ని నేను చూశాను. అప్పుడు పాకిస్థాన్ పర్యటనలో ఉన్నాం. జట్టులో ఎం.ఎస్ ధోని కొత్తగా వచ్చాడు. ఓ షాట్ ఆడిన ధోని పాయింట్లో క్యాచౌట్ అయ్యాడు. ధోనిపై ద్రవిడ్ ఎంతో ఆగ్రహంగా ఉన్నాడు. ' ఇదేనా నువ్వు ఆడే తీరు? మ్యాచ్‌ను నువ్వు ముగించాలన్నాడు. నన్ను సైతం ద్రవిడ్ ఇంగ్లీష్‌లో చాలా అన్నాడు. అందులో నాకు సగం అర్థమే కాలేదు. తర్వాత మ్యాచుల్లో ధోని పెద్దగా షాట్లు ఆడలేదు. ఏమైందని నేను అడిగాను. ద్రవిడ్‌తో మరోసారి తిట్టించుకోవాలని అనుకోవటం లేదు. నెమ్మదిగా ఆడి ముగిస్తాను అన్నాడు' అని వీరూ గుర్తు చేసుకున్నాడు.
ధోనికి ప్రత్యేక ఫోన్! : ఫోన్ కాల్స్‌కు ధోని అందుబాటులో ఉండడనే విషయం నిజమేనని వీరూ అన్నాడు. ' బీసీసీఐ కార్యదర్శి ఓసారి ధోనికి ఫోన్ చేయగా, మహి బదులు ఇవ్వలేదు. తర్వాత ధోనీ కలువుగా.. ఆ కార్యదర్శి ఓ ప్రత్యేక ఫోన్‌ను ఇచ్చాడు. ఈ ఫోన్ ఎప్పుడు మోగినా, కచ్చితంగా సమాధానం ఇవ్వాలని చెప్పాడు. బోర్డు సమావేశాలు, సెలక్షన్ సమావేశాల్లో కెప్టెన్‌గా ధోని అభిప్రాయాలు అవసరం. అప్పట్నుంచి ధోనికి బీసీసీఐ ఫోన్ సదుపాయం కల్పించింది. ఆ ఫోన్ ఇప్పటికీ మహీతో ఉందో లేదో తెలియదు' అని వీరూ చెప్పాడు.