Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ముంబయి: ఐపీఎల్14లో మరో ఆసక్తికర సమరం. ఇద్దరు వికెట్ కీపింగ్ కెప్టెన్లు ముఖాముఖి పోరుకు సిద్ధమవుతున్నారు. సంజు శాంసన్ ఐపీఎల్లో కెప్టెన్‌గా అరంగ్రేటం చేయనుండగా.. కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొత్తదనం చూపించాలని అనుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ నేడు ముంబయి వాంఖడేలో ఢ కొట్టనున్నాయి. ఇరు జట్లలోనూ బిగ్ హిట్టర్లు ఉండటంతో పోటీపడిన ప్రతిసారి భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు క్రిస్ గేల్, నికోలస్ పూరన్, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉండగా.. రాయల్స్‌కు జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్, సంజు శాంసన్, రాహుల్ తెవాటియ రూపంలో ధనాధన్ హిట్టర్లు ఉన్నారు. రాయల్స్‌కు మిడిల్ ఆర్డర్ సమస్యలతో పాటు జోఫ్రా ఆర్చర్ లోటును సైతం పూడ్చాల్సి ఉంది.