Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బాక్సింగ్ శిబిరం
న్యూఢిల్లీ : జాతీయ మహిళా బాక్సర్ల శిక్షణ శిబిరంలో ఇద్దరు సహాయక కోచ్‌లు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. కరోసా సోకిన ఇద్దరు కోచ్‌లను ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచారు. కరోనా కేసులు వెలుగుచూసినా, మహిళా బాక్సర్ల శిక్షణ శిబిరం షెడ్యూల్ ప్రకారం సాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ' ఇద్దరు మహిళా కోచ్‌లు కోవిడ్-19 పాజిటివ్‌గా వచ్చారు. వారిద్దరినీ క్వారంటైన్లో ఉంచాం. క్యాంప్ యథావిధిగా సాగుతుంది. కొందరు బాక్సర్లు సైతం అస్వస్థతతో ఉన్నారు. అయినా వారెవరూ ఒలింపిక్ ప్రణాళికల్లో లేరు. సోమవారం క్యాంప్‌లో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం' అని సదరు వర్గాలు వెల్లడించాయి. పటయాల క్యాంప్‌లో పది కరోనా కేసులు వెలుగుచూసిన అనంతరం, ఇది చోటుచేసుకోవటం క్రీడా వర్గాల్లో ఆందోళనకు కారణం అవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు 9 మంది బాక్సర్లు అర్హత సాధించగా.. అందులో నలుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. ఒలింపిక్స్ సవాల్ ముంగిట, మే 21-31 వరకు ఢిల్లీలో జరుగనున్న ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మేరీకోమ్ సారథ్యంలో మహిళా బాక్సర్లు పోటీపడనున్నారు.