Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ సర్వేలో జపాన్ ప్రజల మనోగతం
టోక్యో : 2020 ఒలింపిక్స్‌కు మరో కొద్ది రోజుల్లో వంద రోజుల కౌంట్‌డౌన్ ఆరంభం కానుండగా.. ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్ ప్రజలు ఆసక్తికర అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ వాయిదా లేదా రద్దును 70 శాతానికి పైగా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మేరకు క్యూడో న్యూస్ పోల్ ఏప్రిల్ 10-12న నిర్వహించిన సర్వేలో ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై వ్యతిరేకత చూపించారు. 39.2 శాతం మంది ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని కోరగా, 32.8 శాతం మంది వాయిదాకు మొగ్గుచూపారు. కేవలం 24.5 శాతం మందే షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ నిర్వహించాలని కోరుకున్నారు. కరోనా వైరస్ కొత్త కేసుల ఉదృతిపై 92.6 శాతం మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. విదేశీ అభిమానులు లేకుండా జులై 23 నుంచి ఆగస్టు 8, 2021 వరకు టోక్యో ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.