Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీ
ముంబయి : మహిళల ఐపీఎల్ మరోసారి మూడు జట్ల ముచ్చటగానే మిగలనుంది. మహిళల చాలెంజ్ ట్రోఫీని నాలుగు జట్ల టోర్నీగా నిర్వహించేందుకు గత సీజన్లో బీసీసీఐ ప్రణాళికలు వేసింది. కరోనా మహమ్మారితో గత సీజన్లోనూ మహిళల చాలెంజ్ ట్రోఫీ మూడు జట్లతోనే జరిగింది. ఐపీఎల్ 12 ప్లేఆఫ్స్ సమయంలో మహిళల చాలెంజ్ ట్రోఫీని షార్జాలో నిర్వహించారు. ' ప్రస్తుతానికి మూడు జట్లతోనే ప్రణాళిక ఉంది. త్వరలోనే తుది నిర్ణయం ఉంటుంది. ఈ ఏడాది మహిళల చాలెంజ్ ట్రోఫీ ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కీలక క్రీడాకారిణులతో చర్చలు నడుస్తున్నాయి' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మహిళల బిగ్‌బాష్ లీగ్, మహిళల చాలెంజ్ ఒకే సమయంలో జరగటంతో ఆసీస్ అమ్మాయిలు షార్జా టోర్నీకి రాలేకపోయారు. ఈ సీజన్లో అన్ని దేశాల అమ్మాయిలు తళుక్కుమననున్నారు.