Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కోల్‌కత నైట్ రైడర్స్‌తో మ్యాచ్
చెన్నై : డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ సీజన్లో బోణీ కొడుతుందా? సన్‌రైజర్స్ సాధికారిక విజయం సాధించిన కోల్‌కత నైట్‌రైడర్స్ బలమైన ముంబయిని నిలువరించగలదా? ఈ ప్రశ్నలకు ముంబయి, కోల్‌కత నేటి మ్యాచ్‌లో సమాధానం లభించనుంది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో భారీ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు కోల్‌కత. సన్‌రైజర్స్ మిడిల్ ఆర్డర్లో డ్యాషింగ్ హిట్టర్ లేకపోవటం ఆ జట్టుకు కలిసొచ్చింది. ముంబయితో పోరు అలా ఉండదు. ఆ జట్టులో టెయిలెండర్లు సైతం ధనాధన్ బాదేస్తారు. అండ్రీ రసెల్, ఇయాన్ మోర్గాన్‌లు పరుగుల వేటలోకి ప్రవేశిస్తే కోల్‌కతకు పెద్దగా కష్టాలు ఉండవు. తొలి ఓటమిని పట్టించుకోని ముంబయి.. కోల్‌కతపై భారీ విజయంతో టైటిల్ రేసును మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. స్పిన్‌కు సహకరించే చెపాక్‌పై ఇరు జట్లు అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. ఈ రెండు జట్ల గత ఐదు మ్యాచుల్లో రోహిత్‌సేన ఏకంగా నాలుగు విజయాలు సాధించి తిరుగులేని పైచేయి సాధించింది. ముంబయి ఇండియన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్ నేడు రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్స్‌లో ప్రసారం.