Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
- పంజాబ్ కింగ్స్ 221/6
రాజస్థాన్ రాయల్స్‌పై హుడా ఉప్పెన. ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో విరుచుకుపడిన దీపక్ హుడా (64) వాంఖడేలో వాహ్ అనిపించే ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన హుడా.. పేస్, స్పిన్ తేడా లేకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ (91) బారీ అర్థ సెంచరీతో రాణించాడు. ఐపీఎల్14లో 200పైచిలుకు పరుగులు చేసిన తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది.
నవతెలంగాణ-ముంబయి
కెఎల్ రాహుల్ (91, 50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్ హుడా (64, 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఉప్పెనలా విరుచుకుపడ్డారు. హుడా ఆరు సిక్సర్లు, రాహుల్ సిక్సర్లతో చెలరేగారు. క్రిస్ గేల్ (40, 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం మెరవటంతో పంజాబ్ కింగ్స్ 221/6 పరుగుల భారీ స్కోరు చేసింది. దీపక్ హుడా, కెఎల్ రాహుల్ మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 105 పరుగులు జోడించి పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు. యువ పేసర్ చేతన్ సకరియ (3/31) పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో ఆకట్టుకున్నాడు.
హుడా, రాహుల్ మెరుపుల్
దేశవాళీ క్రికెటర్ల అదిరే విన్యాసాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా (64, 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 9.5 ఓవర్లలో 89/2తో సాగుతున్న పంజాబ్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వచ్చీ రాగానే శ్రేయాస్ గోపాల్‌పై బౌండరీ బాదిన హుడా.. వరుస ఓవర్లలో శివం దూబెపై రెండు సిక్సర్లు, శ్రేయాస్ గోపాల్‌పై మూడు సిక్సర్లు, క్రిస్ మోరీస్‌పై ఓ సిక్సర్‌తో ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. యువ పేసర్ చేతన్ సకరియను సైతం హ్యాట్రిక్ బౌండరీలు బాదిన హుడా.. కెప్టెన్ రాహుల్‌తో కలిసి 47 బంతుల్లోనే 105 పరుగులు పిండుకున్నాడు.
ఈ ఇద్దరి భాగస్వామ్యంతో పంజాబ్ అలవోకగా భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (91) అర్థ సెంచరీతో రాణించాడు. మయాంక్ అగర్వాల్ (14)తో కలిసి శుభారంభం చేసిన రాహుల్.. క్రిస్ గేల్ (40)తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. క్రిస్ మోరీస్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా బాదిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదిన రాహుల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. రాయల్స్ బౌలర్లలో చేతన్ సకరియ (3/31), క్రిస్ మోరీస్ (2/41) రాణించారు.
పంజాబ్ ఇన్నింగ్స్ : రాహుల్ (సి) తెవాటియ (బి) చేతన్ 91, మయాంక్ (సి) సంజు (బి) చేతన్ 14, గేల్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 40, హుడా (సి) పరాగ్ (బి) మోరీస్ 64, పూరన్ (సి) చేతన్ (బి) మోరీస్ 0, షారుక్ నాటౌట్ 6, రిచర్డ్సన్ (సి) మోరీస్ (బి) చేతన్ 0, ఎక్స్‌ట్రాలు: 06, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 221.
వికెట్ల పతనం : 1-22, 2-89, 3-194, 4-201, 5-220, 6-221.
బౌలింగ్ : చేతన్ 4-0-31-3, ముస్తాఫిజుర్ 4-0-45-0, మోరీస్ 4-0-41-2, గోపాల్ 3-0-40-0, స్టోక్స్ 1-0-12-0, తెవాటియ 2-0-25-0, పరాగ్ 1-0-7-1, దూబె 1-0-20-0.