Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జేమిసన్‌ను ఆర్సీబీ రూ. 15 కోట్లు పెట్టి కొన్న సంగతి తెలిసిందే.అతని కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా.. వేలంలో అంత ధర పలకడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ముంబయితో జరిగిన మ్యాచ్‌లో జేమిసన్ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ హీరో హర్షల్ పటేల్ జేమిసన్ ప్రదర్శనపై స్పందించాడు. బౌలింగ్‌లో స్థిరత్వం ఉండడం అతనికి కలిసొచ్చిన అంశం అని అభిప్రాయపడ్డాడు. 'అతను బౌలింగ్ వేసే సమయంలో చూపించే పట్టుదల నాకు బాగా నచ్చింది. ఒక బౌలర్‌గా 6 అడుగుల 8 అంగుళాలు ఉండడం అతనికి కలిసొచ్చింది. కొత్త బంతితో స్థిరంగా బౌన్సర్లు రాబట్టగల నైపుణ్యం అతనిలో ఉంది. అలాగే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేయించుకున్న అతను మరోసారి దానిని ముంబయితో మ్యాచ్‌లో నిరూపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అతను వేసిన యార్కర్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జేమిసన్ పవర్ ధాటికి కనాల్ బ్యాట్ రెండు ముక్కలైంది. అతని బౌలింగ్‌లో ఉన్న స్థిరత్వమే ఆర్సీబీకి వేలంలో కోట్ల రూపాయలకు దక్కించుకునేలా చేసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.