Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తెలుగు వారు నూతన సంవత్సరంగా ఆచరించే 'ఉగాది' పర్వదినాన్ని పురస్కరించుకుని సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సన్రైజర్స్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వీడియోను ఫ్రాంఛైజీ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్గా మారింది. ఈ వీడియోలో సన్రైజర్స్ ఆటగాళ్లు తెలుగులో శుభాకాంక్షలు తెలియజేసిన విధానం అభిమానుల్లో నవ్వుల పువ్వులు పూయించింది. వచ్చీ రానీ తెలుగులో వారు చేసిన ప్రయత్నం నవ్వులు పూయించడంతో పాటు అందరినీ ఆకట్టుకుంది.