Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని సిక్స్ కొట్టడంలో విఫలమై ఔటైన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్‌కు ఆ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కార మద్దతుగా నిలిచాడు. ప్రధానంగా ఆఖరి ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా దాన్ని వద్దని తనే స్టైకింగ్ తీసుకోవడంపై విమర్శలు వవ్చాయి. క్రిస్ మోరిస్‌కు కూడా బ్యాటింగ్ చేయగలడు కదా.. ఆ బంతికి సింగిల్ తీసి ఉంటే ఆఖరి బంతిని మోరిస్ ఫోర్ కొడితే రాజస్తాన్ రాయల్స్ గెలిచేది కదా అంటూ చాలా మంది పెదవి విరిచారు. సామ్సన్ సింగిల్‌కు యత్నించకపోవడాన్ని కామెంటరీ బాక్స్‌లో ఉన్న సైమన్ డౌల్ కూడా తప్పుబట్టాడు. 'నేను చూసింది నమ్మలేకపోతున్నా. కనీసం సింగిల్ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేది. చివరి బంతిని మోరిస్ ఫోర్ కొడితే సరిపోయేది' అంటూ కాస్త సెటైరిక్‌గా మాట్లాడాడు. దానిని అక్కడే ఉన్న సునీల్ గవాస్కర్ ఖండించాడు.