Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుప్పకూలిన ముంబయి !
- కేకేఆర్ టార్గెట్ 153
- కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్.. గెలుపుదిశగా ముందుకు..
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 ఐదో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అదరగొట్టాడు. రస్సెల్ దెబ్బకు ముంబయి జట్టు కుప్పకూలింది. ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడు (5/15) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ముంబయి జట్టులో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా మిగత ఆటగాళ్లు రాణించలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(2)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ కేకేఆర్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. దాంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందకు నడిపించాడు. అయితే సూర్య తన మార్క్ షాట్స్‌తో అలరించాడు. ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుంటూ భారీ షాట్లు ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 42 రన్స్ చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు మొదట్లో ధాటిగా ఆడటంతో ఓ దశలో భారీ స్కోర్ చేస్తుందనుకున్న ముంబయి జట్టు.. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని షకీబ్ అల్ హసన్ విడదీసాడు. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు చేజార్చుకొని సాధారణ స్కోర్‌కు పరిమితమైంది.
బిగ్ హిట్టర్స్ హార్దిక్ పాండ్యా(15) కీరన్ పొలార్డ్(5)లతో పాటు మార్కో జాన్సెన్(0) వరుస ఓవర్లలో ఔటవ్వగా... చివర్లో కనాల్ పాండ్యా(15) బౌండరీలతో జట్టు స్కోర్‌ను 150 ధాటించాడు. అయితే రస్సెల్ వేసిన చివరి ఓవర్లో అతనితో పాటు రాహుల్ చాహర్(8), బుమ్రా(0) ఔటవ్వడంతో ముంబయి కుప్పకూలింది. కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన రస్సెల్.. చివరి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం గమనార్హం. ఇక కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌కు తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్లో ఆలౌటైన తొలి జట్టుగా నిలిచింది.
ఇక 153 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్ దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిలకడగా అడుతూ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 7.4 ఓవర్లకు కేకేఆర్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 60 పరుగులు చేసింది. ఓపెనర్లు నితీష్ రాణా 37, శుభ్‌మన్ గిల్ 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.