Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐపీఎల్ 14వ సీజన్లో మరోసారి కరోనా కలకలం రేపింది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తమ రెండో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్ట్జేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. 'అతడు(నోర్ట్జే) నెగెటివ్ రిపోర్ట్‌తోనే ఇక్కడికి వచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తు క్వారంటైన్లో ఉండగా టెస్టు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని' ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ ఎస్ఓపీ ప్రకారం..పాజిటివ్‌గా తేలిన వ్యక్తి బయో సెక్యూర్ బబుల్ బయట 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. సీజన్ ఆరంభానికి ముందే క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే.