Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజన్లో అతి తక్కువ స్కోర్
- మ్యాక్స్‌వెల్ 59 , కోహ్లి 33 పరుగులు
- కట్టడి చేసిన హోల్డర్, రషీద్
చెన్నై: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపీఎల్) రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకట్టుకునే బ్యాటింగ్ చేయలేకపోయింది. హోల్డర్, రషీద్‌ల దెబ్బకు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగల్గింది. మ్యాక్స్‌వెల్(59), కోహ్లి(33) మినహా మిగతావారంతా నిరాశపర్చగా.. సన్‌రైజర్స్ బౌలర్లు హోల్డర్(3/30), రషీద్(2/18) ఆకట్టుకున్నారు. బెంగళూరు ఈ సీజన్లో తొలిగా బ్యాటింగ్‌కు దిగి 150 కంటే తక్కువ స్కోరు చేసిన తొలి జట్టుగా నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(11), షాబాద్ అహ్మద్(14) త్వరగా పెవిలియన్‌కు చేరిపోగా.. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫర్వాలేదనిపించాడు. అయితే 13వ ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ.. స్క్వేర్ లెగ్‌లో శంకర్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. విధ్వంస ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒక్క పరుగుకే అవుట్ కావడంతో ఆర్సీబీ అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. అయితే వీరిద్దరూ అవుటైనా గ్లెన్ మ్యాక్స్‌వెల్ అర్ధసెంచరీతో కదం తొక్కడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
క్రీడా స్పూర్తి మరచిన కోహ్లీ
ఎరత పెద్ద ఆటగాడైనా అవుటవ్వడం సర్వసాధారణం. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఔటైన అనంతరం అతడు ప్రవర్తిచిన తీరు విమర్శలకు తావిచ్చిరది. హోల్డర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతిని కోహ్లి షాట్ కొట్టగా.. ఆ బంతిని విజయ్ శంకర్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ 33 పరుగులవద్ద అవుటయ్యాడు. తీవ్ర అసహనంతో పెవిలియన్‌కు చేరుతూ.. కోహ్లీ తన బ్యాట్‌ను మురదుగా బౌరడరీ లైన్ మార్కును కొట్టి ఆ తర్వాత బయట ఉన్న కుర్చీని కూడా బ్యాట్‌తో గిరాటేసాడు. ఇది అరదరిలో చర్చకు దారితీసిరది.
స్కోర్‌బోర్డు..
బెంగళూరు: కోహ్లి (సి)విజయ్ శంకర్ (బి)హోల్డర్ 33, పడిక్కల్ (సి)నదీమ్ (బి)భువనేశ్వర్ 11, షాబాజ్ (సి)రషీద్ (బి)నదీమ్ 14, మ్యాక్స్‌వెల్ (సి)సాహా (బి)హోల్డర్ 59, డివిలియర్స్ (సి)వార్నర్ (బి)రషీద్ 1, సుందర్ (సి)మనీష్ (బి)రషీద్ 8, క్రిస్టియన్ (సి)సాహా (బి)నటరాజన్ 1, జెమీసన్ (సి)మనీష్ (బి)హోల్డర్ 12, హర్షల్ పటేల్ (నాటౌట్) 0, అదనం 10. (20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 149 పరుగులు.
వికెట్ల పతనం: 1/19, 2/47, 3/91, 4/95, 5/105, 6/109, 7/136, 8/149.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-30-1, హోల్డర్ 4-0-30-3, నదీమ్ 4-0-36-1, నటరాజన్ 4-0-32-1, రషీద్ 4-0-18-2.