Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్ రైజర్స్ పై 6 పరుగులతో విజయం
- మ్యాక్స్ వెల్ 59, కోహ్లి 33 పరుగులు
చెన్నై: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపీఎల్) సన్ రైజర్స్ చేజేతులా ఓటమిపాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఛేదించలేక 143 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగల్గింది. మ్యాక్స్ వెల్(59), కోహ్లి(33) మినహా మిగతావారంతా నిరాశపర్చగా.. సన్ రైజర్స్ బౌలర్లు హోల్డర్(3/30), రషీద్(2/18) ఆకట్టుకున్నారు. అనంతరం సన్ రైజర్స్ ఓ దశలో 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యం ఛేదించేలా కనిపించినా.. షాబాజ్ వేసిన 17వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. చివర్లో ఒత్తికి గురై వరుసగా వికెట్లు చేజార్చుకొని 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసి పరాజయాన్ని చవిచూసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(11), షాబాద్ అహ్మద్(14) త్వరగా పెవీలియన్‌కు చేరిపోగా.. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫర్వాలేదనిపించాడు. అయితే 13వ ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ.. స్క్వేర్ లెగ్‌లో శంకర్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. విధ్వంస ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒక్క పరుగుకే అవుట్ కావడంతో ఆర్సీబీ అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. అయితే వీరిద్దరూ అవుటైనా గ్లెన్ మ్యాక్స్ వెల్ అర్ధసెంచరీతో కదం తొక్కడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్(54), మనీష్(38) రాణించడం లక్ష్యాన్ని సునాయాసంగానే ఛేదించేలా కనిపించింది. వీరిద్దరి నిష్క్రమణ అనంతరం వరుసగా వికెట్లను చేజార్చుకుంది. సిరాజ్(2/25), షాబాజ్(3/7), హర్షల్(2/25) మెరవడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. సన్‌రైజర్స్ వరుసగా వికెట్లను కోల్పోయి చేజేతులా పరాజయాన్ని చవిచూసింది.
స్కోర్‌బోర్డు..
బెంగళూరు: కోహ్లి (సి)విజరు శంకర్ (బి)హోల్డర్ 33, పడిక్కల్ (సి)నదీమ్ (బి)భువనేశ్వర్ 11, షాబాజ్ (సి)రషీద్ (బి)నదీమ్ 14, మ్యాక్స్‌వెల్ (సి)సాహా (బి)హోల్డర్ 59, డివిలియర్స్ (సి)వార్నర్ (బి)రషీద్ 1, సుందర్ (సి)మనీష్ (బి)రషీద్ 8, క్రిస్టియన్ (సి)సాహా (బి)నటరాజన్ 1, జెమీసన్ (సి)మనీష్ (బి)హోల్డర్ 12, హర్షల్ పటేల్ (నాటౌట్) 0, అదనం 10. (20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 149 పరుగులు.
వికెట్ల పతనం: 1/19, 2/47, 3/91, 4/95, 5/105, 6/109, 7/136, 8/149.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-30-1, హోల్డర్ 4-0-30-3, నదీమ్ 4-0-36-1, నటరాజన్ 4-0-32-1, రషీద్ 4-0-18-2.
సన్ రైజర్స్:
సాహా (సి)మ్యాక్స్‌వెల్ (బి)సిరాజ్ 1, వార్నర్ (సి)క్రిస్టియన్ (బి)జెమీసన్ 54, మనీష్ (సి)హర్షల్ (బి)షాబాజ్ 38, బెయిర్‌స్టో (సి)డివిలియర్స్ (బి)షాబాజ్ 12, సమద్ (సి అండ్ బి) షాబాజ్ 0, విజరు శంకర్ (సి)కోహ్లి (బి)హర్షల్ 3, హోల్డర్ (సి)క్రిస్టియన్ (బి)సిరాజ్ 4, రషీద్ (రనౌట్)సిరాజ్/డివిలియర్స్ 17, భువనేశ్వర్ (నాటౌట్) 2, నదీమ్ (సి)షాబాజ్ (బి)హర్షల్ 0, నటరాజన్ (నాటౌట్) 0, అదనం 12. (20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 143పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/96, 3/115, 4/115, 5/116, 6/123, 7/130, 8/142, 9/142
బౌలింగ్: సిరాజ్ 4-1-25-2, జెమీసన్ 3-0-30-1, సుందర్ 2-0-14-0, చాహల్ 4-0-29-0, హర్షల్ 4-0-25-2, క్రిస్టియన్ 1-0-7-0, షాబాజ్ 2-0-7-3.