Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కె.విశ్వనాథన్(92)కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. సదరన్ రైల్వేలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన విశ్వనాథన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదుసార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్‌కు ప్రోత్సాహాన్ని, మద్దతుగా నిలిచారు. తుదిశ్వాస వరకు రైల్వే మ్యాన్‌గానే ఉన్నారు.