Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీమ, పూజకు కాంస్యాలు
- ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్
అల్మట్టి: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ డిఫెండింగ్ ఛాంపియన్ సరిత మోర్ స్వర్ణ పతకం గెల్చింది. గురువారం జరిగిన మహిళల రెజ్లింగ్ 59కిలోల విభాగం ఫైనల్లో సరిత మంగోలియకు చెందిన షువ్దార్ను చిత్తుచేసింది. న్యూఢిల్లీలో జరిగిన 2020 ఛాంపియన్ అయిన సరిత తొలుత 1-7 పాయింట్లతో వెనుకబడ్డా.. ఆ తర్వాత వరుసగా 9 పాయింట్లు గెల్చి స్వర్ణ పతకం నెగ్గడం విశేషం. సెమీఫైనల్ సరిత కజకిస్తాన్‌కు చెందిన డైనా కైమోవాను, తొలిరౌండ్ పోటీలో మంగోలియాకు చెందిన సువ్దోర్ను 5-4పాయింట్లతో ఓడించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. 50కిలోల విభాగంలో సీమ బిస్లా, 76కిలోల విభాగంలో పూజ సెమీఫైనల్స్‌లో ఓడి కాంస్యాలకే పరిమితమయ్యారు. సీమ తొలిమ్యాచ్‌ను కజకిస్తాన్‌కు చెందిన వలెంటినా చేతిలో ఓడినా.. ఆ తర్వాత మంగోలియాకు చెందిన అనుదారిని 2-0తో ఓడించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో 2-3తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జస్మినా చేతిలో పోరాడి ఓడింది. ఇక పూజ తొలి మ్యాచ్‌ను 2-0తో కొరియాకు చెందిన జంగ్‌ను ఓడించి, సెమీస్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒజోడా చేతిలో పరాజయాన్ని చవిచూసింది.