Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లికి 'వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్'
- ఉత్తమ మహిళా వన్డే క్రికెటర్‌గా మూనీ
- పొలార్డ్‌కు లీడింగ్ టి20 క్రికెట్ అవార్డు
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి 'వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్' అవార్డు దక్కింది. విస్డెన్ ఎడిటర్ లారెన్స్ బూత్ ఈ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్ల జాబితాను గురువారం ప్రకటించారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వరుసగా రెండో ఏడాది 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును దక్కించుకోగా.. మహిళల విభాగంలో ఆసీస్ క్రికెటర్ బెత్ మూనీ విస్డెన్ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా, టి20 లీడింగ్ క్రికెటర్ అవార్డును వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ గెల్చుకున్నాడు. 32ఏండ్ల కోహ్లి 2008లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసి ఇప్పటివరకు 254వన్డేల్లో 12,169 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌తో దశాబ్దాన్ని ప్రారంభించిన కోహ్లి.. దశాబ్ద కాల వ్యవధిలో 60కిపైగా సగటుతో 11వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు ఉన్నాయి. 1990వ దశాబ్దానికి సచిన్, 1980వ దశకానికి కపిల్ దేవ్ అవార్డులను గెల్చుకున్నారు. 'విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్'కు సిబ్లే, స్టెవెన్స్, క్రాలే(ఇంగ్లండ్)తోపాటు హోల్డర్(వెస్టిండీస్), రిజ్వాన్(పాకిస్తాన్) అవార్డులను దక్కించుకున్నారు. కాగా, విస్డెన్ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును కూడా ఐసీసీ ప్రకటించింది.
విస్డెన్ దశాబ్దపు ఉత్తమ టెస్ట్ జట్టు..
అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), వార్నర్(ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్), కోహ్లి(భారత్)(కెప్టెన్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), సంగక్కర(శ్రీలంక), బెన్ స్టోక్స్(ఇంగ్లండ్), అశ్విన్(భారత్), స్టెయిన్(దక్షిణాఫ్రికా), బ్రాడ్(ఇంగ్లండ్), ఆండర్సన్ (ఇంగ్లండ్).