Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంత్ అర్ధసెంచరీ
- ఢిల్లీ క్యాపిటల్స్ 147/8
ముంబయి: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్)లో ఢిల్లీ కేపిటల్స్ తడబడింది. రాజస్తాన్ రాయల్స్ పేసర్ ఉనాద్కట్ ఓపెనర్లు పథ్వీషా (2), శిఖర్ ధవన్ (9), అజింక్య రహానే(8)లను పెవిలియన్ పంపి ఢిల్లీని తొలుతే కష్టాల్లో నెట్టేశాడు. తర్వాత కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధసెంచరీతో ఆదుకోవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ముఖ్యంగా జయదేవ్ ఉనద్కత్ తొలి ఓవర్లలో నిప్పులు చెరిగే బౌలింగ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు కెప్టెన్ రిషబ్ పంత్ 32 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. దీంతో జట్టు గాడిలో పడినట్టే కనిపించింది. అయితే, ఆ వెంటనే అనవసర పరుగుకు ప్రయత్నించి రియాన్ పరాగ్ అద్భుత త్రోకు రనౌటయ్యాడు. దీంతో మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. యువ క్రికెటర్ లలిత్ యాదవ్(20), టామ్ కరన్(21), క్రిస్ వోక్స్(15నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ మూడు, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు రెండు, క్రిస్ మోరిస్‌కు ఒక వికెట్ దక్కాయి.
సంజూ సూపర్ క్యాచ్..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఉనాద్కట్ వేసిన బంతిని ధావన్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి ధావన్ బ్యాట్‌ను తాకుతూ సామ్సన్‌కు దూరంగా వెళ్లింది. అది వదిలేసి ఉంటే మాత్రం కచ్చితంగా బౌండరీ దాటేది. అయితే మెరుపు వేగంతో సామ్సన్ కుడివైపుగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
స్కోర్‌బోర్డు..
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి)మిల్లర్ (బి)ఉనాద్కట్ 2, ధావన్ (సి)సంజు (బి)ఉనాద్కట్ 9, రహానే (సి అండ్ బి) ఉనాద్కట్ 8, పంత్ (రనౌట్) రియాన్ పరాగ్ 51, స్టోయినీస్ (సి)బట్లర్ (బి)ముస్తఫిజుర్ 0, లలిత్ యాదవ్ (సి)తెవాటియా (బి)మోరిస్ 20, టామ్ కర్రన్ (బి)ముస్తఫిజుర్ 21, వోక్స్ (నాటౌట్) 15, అశ్విన్ (రనౌట్) మిల్లర్/సంజు 7, రబడా (నాటౌట్) 9, అదనం 5. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 147పరుగులు.
వికెట్ల పతనం: 1/5, 2/16, 3/36, 4/37, 5/88, 6/100, 7/128, 8/136
బౌలింగ్: సకారియ 4-0-33-0, ఉనాద్కట్ 4-0-15-3, మోరిస్ 3-0-27-1, ముస్తఫిజుర్ 4-0-29-2, రియాన్ పరాగ్ 2-0-16-0, తెవాటియా 3-0- 27-0