Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీపై 3 వికెట్లతో గెలుపు
ముంబయి: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్)లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంత్(51) మినహా మిగతా బ్యాట్స్మన్లు నిరాశపరిచారు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసి ఓటమి దిశగా పయనిస్తున్న జట్టును మోరిస్(36నాటౌట్; 18 బంతుల్లో 4సిక్సర్లు) చివరి రెండో ఓవర్లలో శివాలెత్తడంతో మరో 2 బంతులో మిగిలి ఉండగానే 150 పరుగులు చేసి గెలిచింది.
టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకోగా.. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయక ఆ జట్టు పేసర్ ఉనాద్కట్ ఓపెనర్లు పథ్వీషా (2), శిఖర్ ధవన్ (9), అజింక్య రహానే(8)లను పెవిలియన్ పంపి ఢిల్లీని తొలుతే కష్టాల్లో నెట్టేశాడు. తర్వాత కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జయదేవ్ ఉనద్కత్ తొలి ఓవర్లలో నిప్పులు చెరిగే బౌలింగ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు కెప్టెన్ రిషబ్ పంత్ 32 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. దీంతో జట్టు గాడిలో పడినట్టే కనిపించింది. అయితే, ఆ వెంటనే అనవసర పరుగుకు ప్రయత్నించి రియాన్ పరాగ్ అద్భుత త్రోకు రనౌటయ్యాడు. దీంతో మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. యువ క్రికెటర్ లలిత్ యాదవ్(20), టామ్ కరన్(21), క్రిస్ వోక్స్(15నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ మూడు, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు రెండు, క్రిస్ మోరిస్‌కు ఒక వికెట్ దక్కాయి. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ ఘోరంగా విఫలమైంది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 50 పరుగులు కూడా చేయలేకపోయింది. అప్పటికే అగ్రశ్రేణి బ్యాట్స్మన్లంతా పెవీలియన్‌కు క్యూ కట్టారు. ఆ క్రమంలో డేవిడ్ మిల్లర్(62) ఆదుకోవడంతో లక్ష్య ఛేదన దిశగా పయనించింది. చివర్లో మోరిస్ మోత మోగించడంతో రాజస్తాన్ గెలుపు సునాయాసమైంది. అవేశ్ ఖాన్‌కు మూడు, వోక్స్, రబడాకు రెండేసి వికెట్లు దక్కాయి.
సంజూ సూపర్ క్యాచ్..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఉనాద్కట్ వేసిన బంతిని ధావన్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి ధావన్ బ్యాట్‌ను తాకుతూ సామ్సన్‌కు దూరంగా వెళ్లింది. అది వదిలేసి ఉంటే మాత్రం కచ్చితంగా బౌండరీ దాటేది. అయితే మెరుపు వేగంతో సామ్సన్ కుడివైపుగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
స్కోర్‌బోర్డు..
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి)మిల్లర్ (బి)ఉనాద్కట్ 2, ధావన్ (సి)సంజు (బి)ఉనాద్కట్ 9, రహానే (సి అండ్ బి) ఉనాద్కట్ 8, పంత్ (రనౌట్) రియాన్ పరాగ్ 51, స్టోయినీస్ (సి)బట్లర్ (బి)ముస్తఫిజుర్ 0, లలిత్ యాదవ్ (సి)తెవాటియా (బి)మోరిస్ 20, టామ్ కర్రన్ (బి)ముస్తఫిజుర్ 21, వోక్స్ (నాటౌట్) 15, అశ్విన్ (రనౌట్) మిల్లర్/సంజు 7, రబడా (నాటౌట్) 9, అదనం 5. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 147పరుగులు.
వికెట్ల పతనం: 1/5, 2/16, 3/36, 4/37, 5/88, 6/100, 7/128, 8/136
బౌలింగ్: సకారియ 4-0-33-0, ఉనాద్కట్ 4-0-15-3, మోరిస్ 3-0-27-1, ముస్తఫిజుర్ 4-0-29-2, రియాన్ పరాగ్ 2-0-16-0, తెవాటియా 3-0-27-0
రాజస్తాన్ ఇన్నింగ్స్: బట్లర్ (సి)పంత్ (బి)వోక్స్ 2, వోవ్రా (సి)రబడా (బి)వోక్స్ 9, సంజు (సి)ధావన్ (బి)రబడా 4, దూబే (సి)ధావన్ (బి)అవేశ్ ఖాన్ 2, డేవిడ్ మిల్లర్ (సి)లలిత్ యాదవ్ (బి)అవేశ్ ఖాన్ 62, రియాన్ పరాగ్ (సి)ధావన్ (బి)అవేశ్ ఖాన్ 2, తెవాటియా (సి)లలిత్ యాదవ్ (బి)రబడా 19, క్రిస్ మోరిస్ (నాటౌట్) 36, ఉనాద్కట్ (నాటౌట్) 11, అదనం 3. (19.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 150 పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/13, 3/17, 4/36, 5/42, 6/90, 7/104
బౌలింగ్: వోక్స్ 4-0-22-2, అవేశ్ ఖాన్ 4-0-32-3, రబడా 4-0-32-3, అశ్విన్ 4-0-30-2, టామ్ కర్రన్ 3.4-0-35-0, స్టొయినీస్ 1-0-15-0.