Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు మింగుడు పడని వార్త. భీకర పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలు కోల్పోయిన రాయల్స్ శిబిరం తాజాగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు సైతం కోల్పోయింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో క్రిస్ గేల్ క్యాచ్ అందుకునే క్రమంలో బెన్ స్టోక్స్ చేతి వేలి గాయానికి గురయ్యాడు. ఎక్స్‌రే, సీటీస్కాన్ రిపోర్టులో స్టోక్స్ వేలి ఎముక దెబ్బతిన్నదని తేలింది. సోమవారం లీడ్స్‌లో స్టోక్స్ చేతి వేలికి శస్త్రచికిత్స చేయనున్నారు. శస్త్రచికిత్స అనంతరం కనీసం మూడు నెలలు స్టోక్స్ క్రికెట్ దూరంగా కానున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. ఐపీఎల్ సహా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు సైతం బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండటం లేదు. బెన్ స్టోక్స్ సేవలు కోల్పోవటం రాజస్థాన్ రాల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయనుంది.