Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట లభించింది. సఫారీ పేసర్ ఎన్రిచ్ నార్జ్‌కు కోవిడ్-19 పాజిటివ్ రావటంతో ఆ జట్టులో ఆందోళన కనిపించింది. క్యాపిటల్స్ స్టార్ పేసర్ కోవిడ్-19 పాజిటివ్ తప్పుడు రిపోర్టు అని తేలటంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు. క్వారంటైన్లో ఉండగా నార్జ్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. పున పరీక్షలో నార్జ్ మూడుసార్లు నెగెటివ్‌గా వచ్చాడు. దీంతో అతడు ముంబయిలోని ఐపీఎల్ బయో సెక్యూర్ బబుల్‌లోకి ప్రవేశించాడు. ' మా పేసర్ ఇప్పుడు క్వారంటైన్ నుంచి బయటికొచ్చాడు. కోవిడ్-19 తప్పుడు రిపోర్టు అనంతరం నార్జ్ మూడుసార్లు నెగిటివ్‌గా వచ్చాడు. ప్రస్తుతం నార్జ్ జట్టు బయో బబుల్‌లో భాగమయ్యాడు. అతడిని మైదానంలో చూసేందుకు ఎదురుచూస్తున్నాం' అని ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది.