Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయల్స్‌తో మ్యాచ్‌పై రికీ పాంటింగ్
ముంబయి : రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య పరాజయానికి కారణం ట్రంప్‌కార్డ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓవర్ల కోటా పూర్తి చేయకపోవటమేనని ఆ జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. 148 పరుగుల స్కోరును ఢిల్లీ క్యాపిటల్స్ కాపాడుకోలేదు. మూడు ఓవర్లే వేసిన అశ్విన్ కేవలం 14 పరుగులు ఇచ్చాడు. డెవిడ్ మిల్లర్ (62), రాహుల్ తెవాటియ (19) రూపంలో ఇద్దరు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉండగా అశ్విన్‌ను కొనసాగించని రిషబ్ పంత్.. బంతిని మార్కస్ స్టోయినిస్ చేతికి ఇవ్వగా ఆసీస్ పేసర్ మూడు ఫోర్లు సహా 15 పరుగులు సమర్పించుకున్నాడు. 58/5 నుంచి 73/5తో గాలి రాయల్స్ వైపు వీచింది. ' అశ్విన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. మా వైపు నుంచి పొరపాటు జరిగింది. దీని గురించి జట్టు సమావేశంలో చర్చిస్తాం. క్రిస్ మోరీస్‌కు ఎక్కువగా సులువైన బంతులే సంధించారు. అతడి షాట్ జోన్లో ఎక్కువ బంతులు వేశారు' అని పాంటింగ్ అన్నాడు.