Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయితో సన్ రైజర్స్ ఢీ నేడు
- ఐపీఎల్ నేటి మ్యాచ్
- హైదరాబాద్ X ముంబయి
- వేదిక : చెన్నై, సమయం : రాత్రి 7.30
- స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
చెన్నై : ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున్న జట్లలో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్. బౌలింగ్ బలంతో అద్భుత విజయాలు సాధించే సన్ రైజర్స్.. తాజా సీజన్లో బోణీ కోసం ఆరాటపడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో విజయాలను ఖాతాలో వేసుకునే సువర్ణావకాశాలను ఆరెంజ్ ఆర్మీ జారవిడిచింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ డగౌట్‌కు చేరగానే.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ వికెట్లు ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. ఫలితంగా సన్ రైజర్స్ సీజన్లో బోణీ కొట్టనేలేదు. రెండు ఓటములతో కుంగిపోయిన హైదరాబాద్ నేడు బలమైన ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా.. కోల్‌కతపై తిరుగులేని విజయం సాధించింది ముంబయి. గత ఐదు మ్యాచుల్లో ముంబయి, హైదరాబాద్ చెరో రెండు మ్యాచుల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో ముంబయి విజేతగా నిలిచింది. నేటి మ్యాచ్‌లో ముంబయిపై విజయంతో బోణీ కొట్టేందుకు సన్ రైజర్స్ సిద్ధమవుతోంది.