Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో ఫైనల్‌కు బజ్రంగ్ దూరం
- నర్సింగ్, కరణ్, సత్యవత్కు కాంస్యాలు
అల్మట్టి(కజకిస్తాన్): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ రవికుమార్ దహియా తిరిగి ఛాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన 57కిలోల విభాగం ఫైనల్లో రవి 9-4 పాయింట్ల తేడాతో అలిరెజ(ఇరాన్)ను చిత్తుచేసి బంగారు పతకాన్ని గెల్చాడు. గత ఏడాది న్యూఢిల్లీ వేదికగా జరిగిన టోర్నమెంట్లోనూ రవి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. ఇక 65కిలోల కేటగిరీలో బజరంగ్ పునియా గాయం కారణంగా ఫైనల్‌కు దూరం కావడంతో జపాన్‌కు చెందిన టకుటో విజేతగా నిలవగా.. బజరంగ్‌కు రజిత పతకం దక్కింది. ఇతర పోటీల్లో కరణ్ మోర్(70కిలోలు), నర్సింగ్ యాదవ్(79కిలోలు), సత్యవత్ కదియాన్(97కిలోలు) ప్రత్యర్థులను ఓడిం కాంస్య పతకాలు గెల్చుకున్నారు. నర్సింగ్ యాదవ్ 8-2 పాయింట్ల తేడాతో అల్బురి(ఇరాక్)ను చిత్తుచేశాడు.