Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: మోంటేకార్లో ఏటిపి టూర్ మాస్టర్స్ 1000 ఫైనల్లోకి 4వ సీడ్ సిట్సిపాస్(గ్రీక్), 6వ సీడ్ ఆండ్రీ రుబ్లేవ్(రష్యా) ప్రవేశించారు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో సిట్సిపాస్ 6-2, 6-1తో అన్‌సీడెడ్ ఇవాన్స్(బ్రిటన్)ను చిత్తుచేయగా.. రుబ్లేవ్ 6-3, 7-5తో రూఢ్(నార్వే)ను ఓడించాడు. క్వార్టర్ఫైనల్లో రుబ్లేవ్ 3వ సీడ్ రఫెల్ నాదల్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ టోర్నమెంట్ ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే ప్రథమం. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిద్దరూ టైటిల్‌పోరులో తలపడనున్నారు.